శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (11:28 IST)

ధన త్రయోదశి రోజున ఇలా పూజలు చేస్తే?

సముద్రంలో కెరటాలు వావడం ఎంత సహజమో జీవితంలో సమస్యలు రావడం కూడా అంతే సహజం. ఏ సమస్య ఎదురైనా చికాకు పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్య మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. కొన్ని సమ

సముద్రంలో కెరటాలు వావడం ఎంత సహజమో జీవితంలో సమస్యలు రావడం కూడా అంతే సహజం. ఏ సమస్య ఎదురైనా చికాకు పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్య మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. కొన్ని సమస్యలు డబ్బు వలనే గట్టేక్కుతుంటాయి. ఆ డబ్బు కొరత లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. 
 
లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా ధన త్రయోదశి చెప్పబడుతోంది. ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవికి దీపం వెలిగించి ఎరుపు రంగు తామర పువ్వులతో పూజించాలి. అంతేకాకుండా లక్ష్మీదేవికి నచ్చిన పదార్థాలను నైవేద్యంగా పెట్టుకుని పూజలు చేయవలసి ఉంటుంది. ఈ త్రయోదశి రోజున ఈ పూజలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక దొరుకుతుంది. తద్వారా ధనధాన్యాలు చేకూరుతాయి.