గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (12:04 IST)

ఫాల్గుణ బహుళ అమావాస్య రోజున శివుడిని పూజిస్తే..

ఫాల్గుణ బహుళ అమావాస్య'ని కొత్త అమావాస్యగా పిలుస్తారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. 
 
సాధారణంగా ప్రతి నెలలోను అమావాస్య రోజున పితృదేవతలకు పిండప్రదానం చేయడం ... తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది.
 
ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమగతులు లభిస్తాయి. ఈ రోజున శివుని పూజతో పితృదేవతలను సంతృప్తి పరచడమే కాకుండా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఆర్థిక బాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.