శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఆధ్యాత్మికం వార్తలు
  4. »
  5. ప్రార్థన
Written By PNR
Last Updated : సోమవారం, 9 జూన్ 2014 (16:50 IST)

గురువారం సాయి ఆరాధన చేస్తే ఆపదలు తొలగినట్టే!

సాయిబాబాకు ఆడంబరమైన పూజలు, పునస్కారాలు అవసరం లేదు. ఏ దేవుడినైనా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే సాయిబాబాను మనసులో నిరంతరం తలుచుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అదే గురువారం సాయిబాబాను స్తుతించి.. దీపాలు వెలిగించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.  
 
సాయిబాబా అన్న మాటలు గుర్తుచేసుకుందాం... 
 
''పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని అని బాబా అన్నారు. అందుచేత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునేందుకు సాయిబాబాను తలచుకుని ప్రయత్నాలు చేస్తూపోతే సత్ఫలితాలుంటాయి.