శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (16:10 IST)

సాయిబాబాకు గురువారం పూట స్వీట్స్ నైవేధ్యంగా సమర్పిస్తే..?

సాయిబాబాను గురువారం నిష్ఠతో పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయి. పువ్వులతో పూజ చేయడంతో పాటు బాబాకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా బాబా అనుగ్రహం పొందువచ్చును. గురువారం పూట బాబా నామాన్ని స్మరించుకుంటూ

సాయిబాబాను గురువారం నిష్ఠతో పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయి. పువ్వులతో పూజ చేయడంతో పాటు బాబాకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా బాబా అనుగ్రహం పొందువచ్చును. గురువారం పూట బాబా నామాన్ని స్మరించుకుంటూ చేసే పూజకు విలువ ఎక్కువ.

అలాగే ఆరోజున పేద ప్రజలకు చేసే అన్నదానం పుణ్యఫలితాలను అందిస్తుంది. ఇంకా సాయిబాబాకు ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించుకుంటే సంకల్ప సిద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. గురువారం పూట సాయిబాబా రోజుగా పరిగణించబడుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈతిబాధలు తొలగిపోవాలన్నా, రుణబాధల నుంచి విముక్తి పొందాలన్నా.. శత్రుబాధ నుంచి తప్పించుకోవాలన్నా.. గురువారం పూట బాబాకు హల్వా, పాలకూరను సమర్పించుకోవాలి. ఇంకా సాయిబాబాకు గురువారం పూట కొబ్బరికాయ, పుష్పాలతో పాటు నైవేద్యంగా కిచిడి, పండ్లు సమర్పించవచ్చు. పుష్పాల మాలతో పాటు స్వీట్, డ్రై ఫ్రూట్స్ కూడా సమర్పించడం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు అంటున్నారు.
 
అలాగే గురువారం పూట సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే తొమ్మిది వారాలపాటు సాయిబాబా వ్రతమాచరించిన వారు లేదా బాబా స్మరణతో సంకల్ప సిద్ధి పొందినవారు భక్తులకు, పేద ప్రజలకు పండ్లు, డ్రై ఫ్రూట్లు, స్వీట్లు పంచాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.