గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (18:25 IST)

కోపాన్ని తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి.!

కోపాన్ని తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ ధ్యానం చేయాలి. ధ్యానం మానసికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆందోళనలను దూరం చేసి.. మెదడును ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది.  
 
ఒకవేళ బాగా పెరిగిపోతుందనే అనుభూతి ఉన్నప్పుడు.. వెంటనే కొంత లోతైన శ్వాసను తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మెదడు కొత్త ఉత్తేజం లభిస్తుంది. తద్వారా కోపాలను దూరం చేసుకోవచ్చు. 
 
కోపం మూలాలను దూరంగా తరలించడం చేయండి. నిజంగా కోపం వచ్చిందని అనుకుంటే బయటకు వెళ్ళి కొంత గాలిని తీసుకోండి. ఏది ఏమైనా డైరక్ట్‌గా చెప్పేయండి. దానికి బదులుగా కోపాన్ని మనస్సులోనే పెట్టుకోకూడదు. కోపాన్ని స్పష్టంగా చెప్పాలి. 
 
కోపాన్ని తగ్గించుకోవాలంటే.. స్నేహితులతో మాట్లాడండి. సమస్యలను చెప్పుకోండి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు కూల్‌గా ఉండాలి. ఎప్పుడూ వెంటనే స్పందించకూడదు.  పగ తీర్చుకోవడానికి ఆతురుత ఉండకూడదు. మీరు ఎల్లప్పుడూ సమయం కారణంగా స్పందించకూడదు.
 
నాణానికి రెండు వైపులా ఆనందం, ఆవేశం రెండు ఉంటాయి. నవ్వును నేర్చుకోండి. కోపంతో ఉన్నప్పుడు కూడా బయటకు నవ్వుతూ ఉండవచ్చునని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.