శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (15:45 IST)

ఫేస్‌బుక్ ఫ్రెండ్సా? అమ్మాయిలూ జాగ్రత్త!

యువకుల నుంచి చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఫ్రెండ్స్ ఉండడం ఈ రోజుల్లో కామన్. రెండో తరగతి పిల్లల నుంచే ఫేస్ బుక్‌లో ఫ్రెండ్స్ ఉంటున్కానారు. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలకు మగ స్నేహితులు ఉండడం, ఫ్రేస్ బుక్ ఫ్రెండ్స్‌, చాటింగ్‌లు, ఇమెయిల్స్ సర్వ సాధారణమైంది. ఫలితంగా అమ్మాయిలకు కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు అధికమవుతున్నాయి. పూర్తిగా కొత్తవారితో పరిచయాలూ, మితిమీరిన స్వేచ్ఛా అమ్మాయిలను సమస్యల్లోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి మీ స్నేహాన్ని హద్దుల్లో ఉంచడం మంచిది. ఎంత స్నేహితులైనా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
 
కాలేజీలోనైనా, ఆఫీసులోనైనా ఒకరి మీద ఒకరు చలోక్తులు విసురుకోవడం సహజమే. అయితే అవి నలుగురిలోనూ అవమానపరచే రీతిలో ఉండకుండా చూసుకోవాలి. కొందరు మగ ఉద్యోగులు వ్యంగ్యంగా, ఉద్దేశపూర్వకంగా ద్వంద్వార్థాలు వచ్చేట్లు మాట్లాడుతుంటారు. అలాంటి తీరుని వెంటనే ఖండించండి. లేదంటే ఆ అతి చనువు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. స్నేహం పేరుతో ఆన్‌లైన్‌లో అపరిచితులతో ఛాటింగ్‌లూ సందేశాలూ పంపడం చేయొద్దు. బాగానే మాట్లాడతున్నారు. అంటూ నమ్మి ఫోటోలు తీయుంచుకోవడం, మీ వ్యక్తిగత ఫోటోలను పంపడం వంటివి చేయొద్దు. 
 
ముఖ్యంగా మీ ఇ-మెయిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల పాస్‌వర్డ్‌లు నమ్మి ఎవరికీ ఇవ్వొద్దు. ఎంత నమ్మకస్తులైనా బుద్ది గడ్డి తింటే వాటిని మార్చి మిమల్ని బెదిరించే ప్రమాదం లేకపోలేదు. మగ స్నేహితులతో అమ్మాయిలు ఒంటరిగా వెళ్లేప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. స్నేహితుడే కదా అని కష్టసుఖాలు పంచుకోవచ్చు. కానీ అతిగా నమ్మి కుటుంబ సభ్యులకు తెలియకుండా డబ్బులూ, ఆభరణాల వంటివి ఇవ్వొద్దు. నిజంగా అతనిది అత్యవసరమే అయితే మీరు సాయం చేయడం మంచిపనే కాబట్టి ఏం చేసినా అందరికీ తెలిసేట్టు చేయండి. మీ కుటుంబ సభ్యులకూ తెలియచేయండి. ఇంట్లో వాళ్లకు తెలియకుండా బాయ్ ఫ్రెండ్స్‌తో ఎక్కడికీ వెళ్ల వద్దు. ఏ స్నేహమైనా పారదర్శకంగా ఉంటేనే అందిరికి మంచిది.