శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (18:08 IST)

ఇంటర్నెట్‌తో బాంధవ్యం కట్.. భాగస్వామి కంటే..?

ఇంటర్నెట్‌తో బాంధవ్యాలు దూరమవుతున్న వార్తలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ ప్రభావంతో రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌పై శాపంగా మారుతున్నాయి. టెక్నాలజీకి చెందిన విషయాల వల్ల ఎన్నో రిలేషన్ షిప్స్ బ్రేక్ అప్ అవుతున్నాయి. 
 
అందుచేత ఇంటర్నెట్‌లో ఎక్కువ సేపు గడిపితే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో గమనించుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు. అందరితో టచ్‌లో ఉండడానికి ఇంటర్నెట్‌తో ఎక్కువ సమయం గడుపుతుంటే అదే పెద్ద సమస్యగా మారుతుంది. 
 
మీ భాగస్వామితో కాకుండా ఎక్కువ సమయం ఇంటర్నెట్‌పై గడిపితే రిలేషన్‌షిప్ దెబ్బతినే ఆస్కారాలు ఎక్కువని సైకాలజిస్టులు అంటున్నారు. బాంధవ్యాలలో జెలసీ అనేది కచ్చితంగా ఉంటుంది. హానీ కలగనంత వరకు సోషల్ నెట్వర్కింగ్‌ను మీరు పరిమితంగా వాడితే ఇబ్బందేం ఉండదు.
 
కానీ, ఎప్పుడైతే పరిమితులు దాటతాయో భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటాయి. అనవసర అపోహలు ఇబ్బందులను కలిగిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించి ఇంటర్నెట్ వాడకానికి పరిమితులను ఎవరికి వారు ఇచ్చుకుంటే మంచిది.