గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (16:21 IST)

ఈర్ష్య, అసూయల్ని జయించడం సాధ్యమేనా?

ఒక్క ముక్కలో చెప్పాలంటే సాధ్యపడదు. అయితే సాధన చేస్తే సాధ్యపడని సంగతే ఉండదన్న సూత్రాన్ని అనువర్తింపజేసుకోవాలి. అనేకానేక భావోద్వేగాల్లో ఈర్ష్య, అసూయలు కూడా అంతర్భాగాలు. తమకు లేనిది ఇతరుల దగ్గ ఉన్నా, వారు తమ కన్నా అధికులు అనుకున్నా ఈ భావాలు చుట్టుముట్టేస్తాయి. ఆ వ్యక్తులు బంధువులు, స్నేహితులు, స్వంతవారు ఎవరైనా కావచ్చు. ఏదో ఒక సందర్భంలో వారిపట్ల ఈర్ష్య కలుగుతుంది. 
 
ఇది ఎటువంటి వారిలోనైనా కనిపిస్తుంది. అయితే ఎవరిని వారు వ్యక్తిగతం అభిమానించుకున్నప్పుడు, ప్రేమించుకున్నప్పుడు వీటిస్థాయి తగ్గిపోతుంది. స్వాభిమానం, ప్రేమ ఉన్నప్పుడు తమకు లేని వాటి గురించి అనుక్షణం తలపోసే గుణం ఉండదు. ఫలితంగా తోటి వారిని చూసి అసూయపడటం తగ్గిపోతుంది. మనలోని గుణాల్ని తప్పక వెలికి తీసుకోవాలి. వాటికి సానపెట్టాలి. ఇతరుల్లో లేని మంచి మనలో ఏముందో అన్వేషించాలి. అప్పడు మనకు లేనిది ఇతరుల వద్ద ఉందనే ఈర్ష్యకు తావుండదు.