బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (19:08 IST)

నాడీ - మానసిక వ్యవస్థల్లోని భారాన్ని తొలగించే గొప్ప ఔషధం "శోకం"

శోకం (ఏడుపు) రాని మనిషి ఉండరు. ఏదో ఒక సందర్భంలో.. ఎపుడో ఒకప్పుడు.. ఎక్కడో ఓచోట కన్నీళ్లు కార్చడం జరుగుతుంది. అయితే కొందరు ఓ వైపు దుఃఖం తన్నుకు వస్తున్నా దాన్ని బలవంతంగా అణుచుకోవాలని చూస్తారు.

శోకం (ఏడుపు) రాని మనిషి ఉండరు. ఏదో ఒక సందర్భంలో.. ఎపుడో ఒకప్పుడు.. ఎక్కడో ఓచోట కన్నీళ్లు కార్చడం జరుగుతుంది. అయితే కొందరు ఓ వైపు దుఃఖం తన్నుకు వస్తున్నా దాన్ని బలవంతంగా అణుచుకోవాలని చూస్తారు. ఇలాచేయడం వల్ల ఏ సుఖమూ ఉండదు. పైగా అది దుఃఖాన్ని మరింత రెట్టింపు చేస్తుంది కూడా. 
 
ఏడవడం బాధాకరనమైన స్థితే కానీ, జరిగిన నష్టాన్ని మన శరీరమూ, మనసూ ఆమోదించే మార్గమే అది. ఆ దుఃఖాంశాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, అదొక దిక్కుతోచని పరిస్థితిలోకి తీసుకెళుతుంది. అంతిమంగా అది మద్యం, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకు గురయ్యేలా చేస్తుంది. అందుకే దుఃఖాన్ని, వాటి తాలూకు కన్నీళ్లను బయటికి రానీయడమే క్షేమకరం అంటున్నారు మానసిక నిపుణులు. 
 
ఎందుకంటే.. ఏడుపు ఎదలో మకాం వేశాక, కన్నీళ్ల రూపంలో దాన్ని బహిర్గతం చేయడం తప్పనిసరి. జరిగిన విషాదం తాలూకు నష్టాన్ని గురించి ఆలోచించకకుండా వాటిని మరిచిపోయే ప్రయత్నాల్లో ఏడుపు ఒకటి. అందుకే ఏడుపొస్తే, ఏడ్చేయడమే ఎంతో ఆరోగ్యకరం. అందుకే మానసికవైద్య నిపుణులు అంటారు... శోకం నాడీ వ్యవస్థ, మానసిక వ్యవస్థల్లోని భారాన్ని తొలగించే గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.