శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (17:24 IST)

ఒంటరితనాన్ని శాపంగా గాకుండా వరంగా మార్చుకోండి.!

తమకు ఎవరూ లేరని, ఒంటరి వారిమని చాలా మంది బాధపడుతుంటారు. మనిషి సహజంగా నలుగురితో కలసి బ్రతకాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఒంటరిగానే మిగిలిపోతుంటాడు. తాను ఏమీ చేయలేనని ఎవరూ లేరని ప్రోత్సాహం ఇచ్చేవారు లేరని తనకు తానే మనసులో బాధపడుతుంటాడు. 
 
ఇలాంటి భావనలే ఇన్‌ఫీరియర్ కాంప్లెక్స్‌కు దారితీస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు సరైన దారిలో పెట్టుకోవాలి.
 
ఒంటరితనం నుంచి బయటపడడానికి సహజ మార్గాలను ఉపయోగించవచ్చు లేదా ఒంటరితనాన్ని పారద్రోలడానికి ప్రయత్నించాలి. అంటే మీతో ఎవరూ లేని సమయంలో ఉపయోగకరంగా ఉండే కొన్ని పనులు చేసుకోండి. ఆ సమయంలో వారి గురించి ఆలోచించకుండా మీకు కావలసిన పనులను చేసుకోండి.
 
అలాగే ఒంటరితనాన్ని పారద్రోలాలంటే నలుగురిలో కలవడానికి ప్రయత్నించాలి. మీకు ఆ అలవాటు లేకపోయినా, అందరితో కలిసి మాట్లాడే అవసరం లేకపోయినప్పటికీ, ఒంటరితనం నుంచి బయటపడడానికి కొన్ని మార్గాలు అనుసరించక తప్పదు. మీకు ఇష్టం ఉన్నా, లేకపోయినా అందరితో కలసి బయటికి వెళ్లడం, కలిసి భోజనం చేయడం వంటివి చేయండి. మొదట్లో మీకు నచ్చకపోవచ్చు. కానీ రాను రాను అలవాటైపోతుంది.
 
ఒంటరితనాన్ని శాపంగా కాకుండా వరంలా మార్చుకోండి. మీకంటే ఒంటరితనంలో కృంగిపోయేవారిని చూడండి. వారికి కాసేపు ఓదార్పు చెప్పి చూడండి. ఆ తర్వాత గమనించండి. మీకు ఎంత ధైర్యం, శక్తి వస్తాయో. మనం ఏ విషయంలోనైనా సరే మరొకరికి సలహా ఇస్తే ఆ విషయంలో మనకు సహజంగానే భయం పోతుంది. ఒంటరితనాన్ని వరంలా మార్చుకునేందుకు ప్రయత్నించండి.