శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (16:53 IST)

స్నేహితులు, దంపతులు కొట్లాడుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి!

స్నేహితులు, దంపతులు కొట్లాడుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి!.. ఆవేశంలో మాట అనేస్తే ఆ తర్వాత వెనక్కి తీసుకోలేమని మానసిక నిపుణులు అంటున్నారు. స్నేహితులు, దంపతుల మధ్య కొట్లాటలు సహజం. అయితే ఆ గొడవ తీవ్రరూపం దాల్చకుండా ఉండాలంటే కొన్ని అంశాలను గుర్తించుకోవాలి. ఆవేశంలో మాటలు రానీయకూడదు. 
 
మాటకు విలువ ఇవ్వండి. కోపంలో అయినా సరే మాటలు అదుపులో పెట్టుకోండి. నీ నుంచి విడిపోవాలనుకుంటున్నాననో, లేక.. విడాకులు తీసుకోవాలనుకుంటున్నాననో అన్న తర్వాత మీరు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా ఫలితం ఉండదు. ఒకవేళ పొరబాటున ఆవేశంలో అనేస్తే, వెంటనే క్షమాపణ కోరడం మంచిది. మరోసారి అలా జరగదని భాగస్వామికి సంజాయిషీ ఇవ్వాలి. అలా మీ స్నేహం లేదా వివాహ బంధంపై నమ్మకం కలిగించాలి. 
 
కొన్ని సందర్భాల్లో మౌనం వహించండి. ఎదుటివారి ఆవేశం తగ్గాక నెమ్మదిగా మాట్లాడటం చేయాలి. ఎవరిపై తప్పుందో ఆత్మపరిశీలన చేసుకుని, ఇద్దరూ లోటుపాట్లు చర్చించుకోవడం ఎంతో మంచిదని మానసిక నిపుణులు అంటున్నారు.