గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (17:46 IST)

సైకాలజీ: ఉత్సాహం మన సొంతం కావాలంటే?

పనిచేసే చోట సానుకూల దృక్పథం అవసరం. అది లేకపోతే చాలా కష్టం. అయితే కొన్ని పనులు చేస్తే ఇంకొన్ని మానేస్తే ఉత్సాహంగా ఉండటం సాధ్యమే అంటున్నారు సైకాలజిస్టులు. సహోద్యోగుల పనిని నిరంతరం సమీక్షించడం, వాళ్ల సామర్థ్యాలలో పోల్చుకుని ఆత్మనూన్యతకు లోనుకావడం అనేది సంతోషం కోల్పోవడానికి ప్రధాన కారణమవుతుంది. దీనికి బదులుగా వారితో స్నేహంగా ఉండటం, కెరీర్ లక్ష్యాలను సాధించుకుంటూ ముందుకు దూసుకెళ్లడం వంటివి సంతృప్తినిస్తాయి. 
 
సృజనాత్మక ఆలోచనలు ఎప్పుడూ ఆఫీసుల్లో రావు. ఉదయం పూట నడిచేటప్పుడో, సాయంత్రం పూట ఏ పార్కులోనో కూర్చున్నప్పుడో వస్తాయట. కాబట్టి ఆరు బయట గడిపేందుకు సమయం కేటాయించాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడూ కోపంలో ఉన్నప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు. అవి మరింత ఒత్తిడిని కోపాన్ని తెచ్చిపెడతాయి. మీరు సంతోషంగా ఉంటే పక్కనున్న వ్యక్తినీ సంతోషంగా ఉంచగలుగుతారు. కాబట్టి సంతోషంగా ఉండటం మీ బాధ్యతే.