శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (16:59 IST)

స్మార్ట్ ఫోన్ల వాడకం.. భాగస్వామి కంటే.. బ్లూ ఫిలిమ్స్‌తో..?

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం మంచిదే. కానీ మితిమీరిన వినియోగం ద్వారా మెదడుకు చాలా హానికరం. స్మార్ట్‌ఫోన్ల వాడకం తులనాత్మకంగా, బాధ్యతారాహిత్యంగా, అజాగ్రత్తగా చేస్తుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ మిమ్మల్ని విఫలం చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో సంబంధాలు కూడా కటీఫ్ అవుతున్నాయని ఎన్నో సర్వేలు తేల్చాయి. 
 
ప్రేయసితో కూర్చుని ట్విట్టర్ లేదా ఫేస్ బుక్‌లో బిజీగా ఉండటం అనేది కచ్చితంగా ఆరోగ్యకరమైన సంబంధానికి సంకేతం కాదని మానసిక నిపుణులు అంటున్నారు. భాగస్వామితో లేదా ప్రేయసితో నేరుగా సంబంధం కాకుండా ఫేస్ బుక్ స్టేటస్ ద్వారా వారి మూడ్‌ను లెక్కకట్టడం ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అలవాట్లు సంబంధాలను తెగతెంపులు చేసే స్థాయికి చేరుస్తాయి.
 
అందుచేత సినిమాలు చూడటానికి ఇంటర్నెట్ సర్ఫింగ్ చేసినప్పుడు కళ్ళు ఒత్తిడికి గురి అవుతాయి. దానికి బదులుగా, ప్రకృతితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి. శరీర బరువు కోల్పోవటానికి వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ట్రై చేయండి. 
 
రోడ్లు దాటుతున్నప్పుడు, కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, బిల్లు చెల్లించేటప్పుడు ఫోన్ల వాడకం ఏమాత్రం సరికాదు. ఇక భాగస్వాముల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లు ఎందరో శృంగార జీవితంపై ప్రభావం చూపుతోందని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
స్మార్ట్ ఫోన్ల వాడకంతో భాగస్వామితో గడపడం కంటే అనేకమంది పురుషులు సహ ఉద్యోగులతో గడపడం.. బ్లూ ఫిలిమ్స్‌ చూస్తూ కాలం గడపేస్తున్నారని సర్వేలు తేల్చాయి. సో ఇకనైనా.. స్మార్ట్ ఫోన్స్ వాడకం తగ్గించండి.