బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (12:43 IST)

చిత్తూరు జిల్లాలో 2,200 యేళ్ళ నాటి పురాతన ఆలయం!

చిత్తూరు జిల్లా. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికి గుర్తుచ్చేది ఆధ్మాత్మిక ఆలయాలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అలాంటి ఆలయమే తిరుపతికి అతి సమీపంలోని గుడిమల్లం. గుడిమల్లం ఆల

చిత్తూరు జిల్లా. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికి గుర్తుచ్చేది ఆధ్మాత్మిక ఆలయాలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అలాంటి ఆలయమే తిరుపతికి అతి సమీపంలోని గుడిమల్లం. గుడిమల్లం ఆలయం క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల్లో నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. త్రవ్వకాల్లో లభ్యమైన శాసనాల ఆధారంగా ఈ నిర్ధారణ చేశారు. ఇప్పటిదాకా లభ్యమైన శివలింగాలలో ఇదే పురాతనమైనదిగా చెబుతున్నారు. శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉంటుంది. 
 
దాదాపు ఐదు అడుగుల ఈ శివలింగంపై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, ధోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేదకాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది. చోళ, పల్లవ, గంగ పల్లవ, రాయల కాలంలో ధూప, దీప నైవేధ్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954 సంవత్సరంలో గుడిమల్లం గ్రామస్తుల నుంచి ఆర్మియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది.
 
ఆనాటి నుంచి గుడిలో పూజలు ఆగిపోయాయి. ఆ తర్వాత 2009 సంవత్సరంలో పూజలు పున ప్రారంభమయ్యాయి. స్థానికులే ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అదే తితిదే ఆ బాధ్యతలు చేపడితే ఆలయం మరింత ప్రాచూర్యం పొందుతుంది. శివాలయామా.. వైష్ణవాలయమా అనే దానితో నిమిత్తం లేకుండా అత్యంత పురాతన ఆలయంగా దీనికున్న ప్రత్యేతను దృష్టిలో ఉంచుకుని తితిదే విలీనానికి చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.