బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:13 IST)

తెలంగాణ చిలుకూరి బాలాజీకి ఆంధ్ర తిరుమల వెంకన్న వేయి కోట్ల అప్పా?

తెలంగాణ చిలుకూరి బాలాజీకి ఆంధ్ర తిరుమల వెంకన్న స్వామి అప్పు పడ్డారా? ఇదేంటి స్వామి వారి వివాహానికి కుబేరుడు ధన సాయం చేశాడని, కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచే పనిని గోవిందరాజస్వామి చేపట్టారని.. అలా కుబేర

తెలంగాణ చిలుకూరి బాలాజీకి ఆంధ్ర తిరుమల వెంకన్న స్వామి అప్పు పడ్డారా? ఇదేంటి స్వామి వారి వివాహానికి కుబేరుడు ధన సాయం చేశాడని, కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచే పనిని గోవిందరాజస్వామి చేపట్టారని.. అలా కుబేరుని వద్ద తీసుకున్న అప్పుకే శ్రీవారు వడ్డీ కట్టుకుంటున్నారని స్థలపురాణం చెప్తోంది.

అలా కుబేరుని అప్పే తీర్చలేక వడ్డీ కట్టుకుంటున్న శ్రీవారు మళ్లీ చిలుకూరి బాలాజీకి కూడా అప్పు పడ్డారా? అనుకుంటున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ వినండి. కలియుగ వైకుంఠం, తిరుమల కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆదాయంలో తెలంగాణ వాటా కోసం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
 
టీటీడీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.వెయ్యి కోట్లను ఇప్పించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించడంతో టీటీడీ తలపట్టుకుని కూర్చుంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఏపీ, తెలంగాణ రాష్ట్ర సర్కార్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
 
చిలుకూరు బాలాజీ ప్రత్యేకత 
చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల, మరొకటి తెలంగాణలోని చిలుకూరు‌గా ప్రతీతి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. 
 
వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయంలో వీఐపీ దర్శనాలు, టికెట్లు, హుండీలు ఉండవు. అదే చిలుకూరు ఆలయం ప్రత్యేకత. ఇంకా ఒకే ప్రాంగణంలో ఒకవైపు వేంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకోవటం ఈ ఆలయం విశిష్టత.