బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 అక్టోబరు 2014 (17:33 IST)

ధైర్యమనే ఆయుధం మన వెంట ఉంటే?

ఎండాకాలంలో అడవిలోని కుందేళ్ళన్నీ రేగుపొదల్లో సమావేశమయ్యాయి. ఆ కాలంలో పంటలు లేక ప్రకృతి జంతువులన్నీ అల్లల్లాడుతున్నాయి. చిన్న జంతువులన్నీ పెద్ద జంతువులకు ఆహారమౌతిన్నాయ్. కుక్కలు అడవిలో సంచారం చెయ్యడం మొదలు పెట్టాయ్ కుందేళ్ళ కోసం. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయ్. 
 
ఆ కుందేళ్ళలో ఒకటి ఇలా అంది.. బ్రహ్మదేవుడు మనకు సున్నితమైన చిన్న రూపాన్నిచ్చాడు. దుప్పులకిచ్చినట్లు కొమ్ముల్ని ఇవ్వలేదు. పిల్లులకిచ్చినట్లు వాడి గోళ్ళను ఇవ్వలేదు. మన మీద ఎవరు దాడిచేస్తే పారిపోవడం తప్ప మనకేది దారి. దేవుడు కష్టాలన్నీ మన మీద పడేశాడు అంటూ వాపోయింది. 
 
వెంటనే మరో కుందేలు ఇలా ఉంది. ఈ కష్టాలు నిత్య గండాలతోనే పడలేదు. హాయిగా అదిగో అక్కడ కనబడే చెరువులో దూకడం ఉత్తమం అంది. మిగతా కుందేళ్ళన్నీ బతికినంత కాలం కలిసే బతికాం. చనిపోయేటట్లయితే అంతా కలిసే చద్దాం.. అని చావడానికైనా దగ్గరలో ఉన్న చెరువుకేసి బయల్దేరాయి. 
 
అదే సమయానికి లెక్కలేనన్ని కప్పలు చెరువు కట్టపై కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నాయి. కుందేళ్ళన్నీ ఓ మందగా చెరువుకేసి రావడంతో భయపడిన కప్పలన్నీ చప్పున నీళ్ళల్లోకి దూకేశాయి. అది చూసిన ఓ కుందేలు, శభాష్ మనం చనిపోవాల్సిన పనే లేదు. దైవం సృష్టిలో మనకంటే అల్పమైనవి, మనల్ని చూసి భయపడేవి కూడా వున్నాయి. 
 
అవి బతగ్గా లేనిది, మనం బతకలేమా? రండి హాయిగా జీవించేద్దాం... అనేసరికి కుందేళ్ళన్నీ నిజమే కదా  అంటూ తమ ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుని వెనక్కి మళ్ళిపోయాయి. 
 
కష్టాలు వస్తుంటాయి. అయితే మనకంటే కష్టాలు పడే వాళ్లూ ఉన్నారు. మనకంటే పేదవాళ్ళు, అనారోగ్యవంతులు ఎందరో ఉంటారు. వారికంటే మనమే నయమనుకుని ధైర్యంగా బతికేయాలి. ధైర్యమనే ఆయుధం మన వెంట ఉంటే భయమే ఉండదు మరి!