Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే దరిద్రం పట్టుకుంటుందా?

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (13:45 IST)

Widgets Magazine

అక్షయ తృతీయ వస్తుందంటే నగల దుకాణాలు కిక్కిరిసిపోతుంటాయి. అక్షయ తృతీయ పండుగనాడు తప్పకుండా బంగారు, వెండి నగలను కొనాలంటూ ప్రచారం జరగడంతో ప్రజలు అప్పు చేసైనా బంగారం కొనాలని చాలామంది ఎగబడుతుంటారు. ఐతే ఇలా బంగారు, వెండి వస్తువులు కొనడం వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదంటున్నారు కొంతమంది జ్యోతిష నిపుణులు. మేలు జరగడం అలావుంచి దరిద్రం పట్టుకుంటుందని చెపుతున్నారు.
lakshmidevi
 
దీనికి ఓ కథను ఉదహరిస్తూ... ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి వివరించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే వ్రతం, జపం, హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుందని చెపుతాడు. సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజామందిరమును శుభ్రపరచి, దేవుని పటాలకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. 
 
ఆ తర్వాత దీపాలను కూడా పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకుని దీపాలు వెలిగించుకోవాలి. పూజామందిరాన్ని అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి. అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని కింద పసుపు, బియ్యం, నాణేలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపులో వినాయకుడిని చేసి.. దానికి కుంకుమ, పువ్వులు పెట్టుకోవాలి. 
 
కొత్త వస్త్రాలు, బంగారం వుంటే కలశానికి ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. అక్షయ తృతీయ నాడు ఏప్రిల్ 29న చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. దానం చేయమని పురాణాలు చెపుతుండగా కొత్తగా బంగారం, వెండి కొనాలంటూ ప్రచారం రావడం విచిత్రమంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

తితిదే కాంట్రాక్ట్ పనుల్లో భారీ కుంభకోణం - ఒకే సంస్థకు పగ్గాలు..!

తిరుమల, తిరుపతిలోని తితిదే అద్దె గదులను శుభ్రం చేసే హౌస్ కీపింగ్‌కు సంబంధించి ఇటీవల ...

news

ఏ ఆకులో భుజిస్తే ఏంటి ప్రయోజనం...?

అరటి ఆకులో భోజనం చేయడానికి పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా ...

news

లంకలో హనుమంతుడు ఎడమకాలు ఎందుకు పెట్టాడంటే...?

నూతన వధువు వరుడుతో కలిసి తన అత్తవారింటిలోకి ముందుగా కుడికాలు పెడుతూ గృహప్రవేశం చేస్తుంది. ...

news

మంగళవారం పూట హనుమాన్ జయంతి.. మారుతిని పూజించండి

నేడు (ఏప్రిల్ 11) హనుమాన్ జయంతి. మంగళవారం పూట వచ్చిన ఈ హనుమాన్ జయంతి రోజున రామనామ జపం ...

Widgets Magazine