శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 మార్చి 2015 (17:36 IST)

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఎంగిలి ఎవరికీ పెట్టరాదు!

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి నమస్కరించి తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు నిందింపకూడదు. ప్రశాంత వాతావరణంలో ఆహారం తీసుకోవాలి. ఎంగిలి ఎవరికీ పెట్టకూడదు. అమిత భోజనం ఆరోగ్యభంగాన్ని కలిగిస్తుంది. 
 
ఎంగిలి చేత్తో బ్రాహ్మణుని, ఆవును, అగ్నిని తాకరాదు. తలకు గుడ్డచుట్టుకుని, చెప్పులు, బూట్లు వేసుకుని భుజించరాదు. దక్షిణం వైపు తిరిగి భుజించకూడదు. తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. మంచంపైన కూర్చుని ఏవీ తినకూడదు. ఏ వస్తువునైనా ఒడిలో పెట్టుకుని తినరాదు. 
 
భోజనం ఆకుల్లో పెట్టడమే మంచిది. అది ఆరోగ్యప్రదం. ప్లేట్లు ఉపయోగించడం వల్ల జబ్బులు వ్యాపించే అవకాశం ఉంది. ప్రాతస్సాయం సంధ్యా సమయాల్లో చేసే ఉపాసన సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి "న సంధ్యయోర్నమధ్యాహ్నే నార్థరాత్రే కదాచన" సంధిసమయాల్లో, అర్థరాత్రిలో భుజింపరాదు. అర్థరాత్రి సూర్యసంబంధం బొత్తిగా లేనందున ఆకలి మందగించి ఉంటుంది. కాబట్టి అర్థరాత్రి భోజనం నిషేధమని పండితులు అంటున్నారు.