గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (16:27 IST)

పువ్వులు తలలో పెట్టుకున్నట్లు కల వస్తే?

గుడిని కలలో చూసినగాని, పూజలు జరుగుతున్నట్లు గానీ చూసినచో అనవసరమయిన గొడవలతో తల దూర్చి మనశ్శాంతి లేకుండా ఉంటారు. భజనగాని, నాటకమును కలలో చూసిన సుఖవంతమైన జీవనం కలుగుతుంది. 
 
పువ్వులు తలలో పెట్టుకున్నట్లు కల వచ్చినట్లైతే అధిక సంతోషము కలుగును. పువ్వులను వాసన చూసినట్లు కలవచ్చినచో స్త్రీ సౌఖ్యం. స్త్రీ వలన ధనలాభము కలుగును. పూవు గల చెట్లను కలలో చూసినచో సంతానప్రాప్తి కలుగును.
 
ముత్యాలు, రత్నాలు కనిపిస్తే శుభము కలుగుతుంది. పచ్చని కాయలు గల చెట్టును కలలో చూసినట్లైతే చేయు పనుల్లో ఆటంకము కలుగునని పండితులు అంటున్నారు. 
 
కలలో తెలుపు రంగు పువ్వులు కనిపిస్తే ప్రశాంతత చేకూరుతుంది. అలాగే రెడ్ రోజ్‌లు ప్రేమకు, పసుపు రంగు పుష్పాలు స్నేహానికి ప్రతీతంగా చెబుతారు.