గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (16:30 IST)

దీర్ఘసుమంగళీ ప్రాప్తాన్ని ప్రసాదించే హోలీ పండుగ!

హోలీ రోజున హోలిక ధావన్ చేస్తారు. మంటల్లో చెడును నశింపజేసి కొత్త ఉత్సాహాన్ని ఆహ్వానిస్తారు. రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ.. ఆనందాన్ని పంచుకుంటారు. వసంత పంచమి రోజున జరుపుకునే ఈ పండుగను సామూహికంగా రంగులతో జరుపుకుంటారు. అదీ హోలీ పండుగ శుక్రవారం రావడంతో హోలిక అనే రాక్షసిని దహింపజేసి.. చెడును పోగొట్టుకుని.. కొత్త ఉత్సాహాన్ని పొందుతారు.
 
ఆ రోజున మంటలను మండించి ఆపై ఇంటి ముందు దీపాలు వెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. అదీ శుక్రవారం వచ్చే హోలీ పండుగ రోజున సుప్రసిద్ధ హోలీ పండుగను జరుపుకునే మండపాలను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం లభిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ముక్కంటికి దహనమైన మన్మధుడిని రతి దేవి ఈ రోజునే తిరిగి పొందగలగడమే కాకుండా.. సజీవ వరాన్ని పొంది దీర్ఘ సుమంగళీ ప్రాప్తాన్ని శివుడి వద్ద పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి.