శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2015 (17:52 IST)

నాగపంచమి రోజున నైవేద్యంలో ఉప్పు వాడొద్దు..!

నాగపంచమి రోజున 12 పేర్లు కలిగిన సర్పాలను పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. అనంత, శేష, పద్మ, కంబళ, కర్కోటక, అశ్వతార, ద్రితరాష్ట్ర, శంఖ్పాలా, కాళీయ, తక్షక, పింగళ దేవుళ్లను పూజించాలి. నాగపంచమి రోజున ఉపవాసముండాలి. శివునికి, నాగేంద్రునికి పాలు, పాలతో చేసిన ఖీర్‌ను నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యంలో ఉప్పును మాత్రం వాడకుండా జాగ్రత్త పడాలి. 
 
పాము పుట్టకు పూజచేసేటప్పుడు పువ్వులను పుట్టపై చల్లాలి. అలాగే వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేయాలి. పూజ పూర్తయ్యాక ప్రసాదంగా పెట్టిన నైవేద్యాన్ని భక్తులకు పంచాలి. 
 
అలాగే పుత్రదైకాదశి నాడు సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్దలతో శ్రావణ శుక్ల 11వరోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లైతే సంతానభాగ్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.