శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (14:44 IST)

ఈ వారాల్లో ఆభరణాలు ధరిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

ఆభరణాలు అంటే నచ్చని వారుండరు. ఇంట్లో ఉన్నప్పుడే రకరకాల ఆభరణాలు ధరిస్తుంటారు. ఇక భయటకు వెళ్లారంటే.. అసలు చెప్పలేం.. మరి ఈ ఆభరణాలలోని ప్రాముఖ్యతను తెలుసుకుందాం..
 
కొత్త ఆభరణాలు కొనడానికి వెళ్లిన ప్రదేశంలో ఎక్కడెక్కడ మంచి మంచి షాప్స్ ఉన్నాయో అక్కడి వెళ్లి నచ్చిన వాటిని కొంటుంటారు. ఆభరణాలు నచ్చినవి కొంటేనే సరిపోదూ.. వాటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. కొత్తవాటిని కొనేందుకు మాత్రం మంచి రోజు చూసి వెళ్తుంటారు. కానీ, వాటిని ధరించేటప్పుడు ఈ రోజు ఎలా ఉందో ఒకవేళ ధరిస్తే ఏం జరుగుతుందో అన్న ఆలోచనే ఉండదు. ఇలా ధరించడం వలన అనారోగ్యాల పాలవుతారని పండితులు చెప్తున్నారు. 
 
వాస్తవానికి నూతన ఆభరణాలను ధరించే ముందుగా వారం వర్జ్యం చూసుకోవాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ రోజుల్లో ధరిస్తే మంచి జరుగుతుందో చూద్దాం.. ఆదివారం నాడు కొత్త ఆభరణాలు ధరిస్తే వారిలో రోగ భయం కలుగుతుంది. అలానే సోమవారం నాడు ధరిస్తే వారిలో మనశ్శాంతి చేకూరుతుంది. 
 
మంగళవారం నాడు కొత్త ఆభరణాలు ధరిస్తే ఆ ఇంట్లో గొడవలు, రోగబాధ కలుగుతుందని చెప్తున్నారు. కనుకు మంగళ వారాల్లో ఆభరణాలు ధరించకండి.. బుధవారాల్లో నూతన ఆభరణాలు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడింది. ఇక గురువారం రోజున ధరిస్తే వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి.
 
శనివారం నాడు ధరిస్తే చోరీకు గురవుతారు. వస్తువులను తాకట్టుపెట్టాల్సి వస్తుంది. కనుక జాగ్రత్త వహించండి. అంతేకాకుండా అనారోగ్యాలతో బాధపడవలసి వస్తుంది. వారంలో ఏడు రోజులు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో 4 రోజులు కొత్త ఆభరణలు ధరిస్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.