గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 29 జులై 2016 (20:59 IST)

ఆషాఢ మాసంలో పెళ్ళిళ్లు ఎందుకు చేసుకోరు..?

ఆషాఢ మాసంలో అంతవరకు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడుతుంది. ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను ఉందని పండితులు చెబుతారు. హిందువులు అవసరమైతే పెళ్లిని మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ

ఆషాఢ మాసంలో అంతవరకు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడుతుంది. ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను ఉందని పండితులు చెబుతారు. హిందువులు అవసరమైతే పెళ్లిని మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ ఆషాఢ మాసంలో మాత్రం పెళ్లి చెయ్య‌రు. అలాగే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది.
 
* ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదు కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్దపెద్ద శుభకార్యాలకు శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.
* అసలు ఆషాఢంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. దీనివల్ల వాళ్లకు పెళ్లి కార్యక్రమాలు చేయడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లే ఆషాఢ మాసంలో వివాహాలు నిర్వహించరు.
* ఉత్తరాయణ, దక్షిణాయణ కథల ప్రకారం ఆషాడ మాసం సమయంలో దేవుడు నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడి ఆశీస్సులు అందవనే నమ్మకంతో ఇలా ఆషాఢంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెబుతారు.
* అలాగే సౌత్ ఇండియాలో ఆషాఢ మాసం అంటే ఎలాంటి పంట చేతిలో ఉండదు. పెళ్లి చేయడానికి అవసరమయ్యే డబ్బులు ఉండక ఇలా సంప్రదాయం పేరుతో ఆషాఢంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని పండితులు చెబుతున్నారు. 
 
* పూర్వకాలంలో పెళ్లి అంటే ఎక్కువ ఖాళీ ప్రదేశంలో పెద్దపెద్ద పరదాలు కట్టి నిర్వహించేవాళ్లు. ఆషాఢ మాసంలో గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గాలి తీవ్రతకు పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే పెళ్లి వంటకాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం ఉంటుంది. విద్యుత్ వైర్లు కట్ అవడం, హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటాయి. ఈ కారణాల వల్ల ఆషాఢంలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించకపోవడం మంచిదని పెద్దవాళ్లు ఈ నిర్ణయానికొచ్చారు.
* ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఆషాఢమాసం వచ్చిందంటే కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పెళ్లికూతుళ్లను పుట్టింటికి పంపిస్తారు.
* కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాఢమాసంలో విడివిడిగా ఉండటానికి మరో కారణం ఉంది. ఆషాఢ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సమ‌యంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.
* ఎండాకాలంలో నార్మల్ డెలివరీ చాలా ఇబ్బందికరమైనది. అలాగే ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం ఆసుపత్రుల్లో మంచి ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లట.
* ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆషాఢం సమయంలో వాతావరణం మారుతుంది. ఈ క్లైమేట్లో మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట.