గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 సెప్టెంబరు 2014 (17:16 IST)

కష్టంలోనే నిజమైన ఆనందం ఉంటుంది తెలుసా?

మానవుడు సుఖంగా జీవనాన్ని సాగించాలనుకుంటాడు. కానీ సుఖభోగాలు, అన్ని సౌకర్యాలు, వసతులు, తలచుకోగానే అన్ని వస్తువులు లభించడం వంటివి జరిగిపోతే.. ఇక ఆ భోగభాగ్యాలతో కొందవరకే సంతోషముంటుంది. అయితే కష్టం తర్వాత పొందే సుఖంలో ఎంతో ఆనందం ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
జీవితంలో కష్టసుఖాలు తప్పనిసరి. కష్టాలను అధిగమించేటప్పుడే సుఖంలోని ఆనందం అర్థమవుతుంది. కష్టపడి సాధించే ఏ విషయమైనా గొప్పగా ఉంటుంది. కష్టపడి, శ్రమించి లభించే వస్తువుకు.. సులభంగా దొరికే వస్తువుకు చాలా తేడా ఉంది 
 
ఇంకా ప్రతి మనిషి పుట్టుక ఒకేలా ఉన్నప్పటికీ, చిన్న చిన్న సమస్యలను కూడా కొందరు పెద్ద సమస్యగా భావించి తెగ బాధపడిపోతుంటారు. కొందరు మాత్రమే జరుగుతున్న ప్రతీ సంఘటననూ ఒక అనుభవంగా మార్చుకోగలుగుతారు. 
 
మనిషి జీవితకాలంలో కష్టాలూ-సుఖాలూ ఎదుర్కొంటూనే ఉంటాడు. ఎదుర్కునేకొద్ది జీవితం గడపడానికి సులభమవుతుంది. కష్టంతోనే సుఖాన్ని పొందవచ్చని తెలుసుకో గలిగి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతే జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలమని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
అందుచేత కష్టాలు కలిగినప్పుడు బాధపడేకంటే.. ఆ కష్టాలను ఎలా అధిగమించాలనే దానిపై శ్రద్ధ, కృషి పెడితే తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారని ఆధ్యాత్మిక పండితులు సలహా ఇస్తున్నారు.