శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (14:22 IST)

శ్రీరాముడు ఇసుక లింగాన్ని ఎందుకు పూజించాడు.. దేవతలు ఏయే లింగాలను ప్రార్థిస్తారో తెలుసా?

శ్రీరాముడు రావణాసురుని వధించడంతో బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తుడయ్యేందుకు శివలింగ ప్రార్థన చేయాల్సి వచ్చింది. అంతేగాకుండా రామేశ్వరంలో శివలింగ పూజకు సిద్ధమైపోయాడు. శివలింగ ప్రతిష్టాపన కూడా రామేశ్వరంలో

శ్రీరాముడు రావణాసురుని వధించడంతో బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తుడయ్యేందుకు శివలింగ ప్రార్థన చేయాల్సి వచ్చింది. అంతేగాకుండా రామేశ్వరంలో శివలింగ పూజకు సిద్ధమైపోయాడు. శివలింగ ప్రతిష్టాపన కూడా రామేశ్వరంలో చేయాలనుకున్నాడు. సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన "పుల్ల'' గ్రామానికి దగ్గరలో, సేతువుకు సమీపంలో, గంధమాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని రామ సంకల్పం.

ఇందుకోసం హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన లింగాన్ని విశ్వేశ్వర లింగంగా.. తాను పూజ చేసిన ఇసుక లింగాన్ని కూడా రామేశ్వరంలోనే ప్రతిష్టించి... ఆపై రామరాజ్య పాలన కోసం వెళ్ళినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇలా రాముడు విష్ణు అవతారుడైనప్పటికీ శివలింగానికి పూజ చేసి.. బ్రహ్మహత్యా దోషాన్ని దూరం చేసుకుంటాడు. అలాగే ఇతర దేవుళ్లు కూడా పరమాత్మ అయిన శివుని వేర్వేరు రూపాల్లో పూజిస్తారు. 
 
సాధారణంగా మనుషులు దేవుళ్లను పూజిస్తారు.. ఆ పూజలు కష్టాలు తొలగిపోవాలని.. కోరికలు నెరవేరాలని.. కానీ పూజ అంతరార్థం కోరికలు నెరవేర్చుకోవడమే కాదు. పూజ లోక కళ్యాణం కోసం అందుకే దేవుళ్లయినా సరే.. దేవతలు కూడా పూజలు చేస్తారు. ప్రత్యేకించి శివుడిని కొలుస్తారు. రాముడిలా ఇతర దేవుళ్లు ఏ శివలింగాన్ని పూజిస్తారో తెలుసుకోవాలనుందా? అయితే చదవండి మరి. 


దశావతారి అయిన విష్ణుమూర్తి ఇంద్ర లింగాన్ని పూజిస్తాడు. ఇక త్రిమూర్తుల్లో ఒకరైన సృష్టికర్త బ్రహ్మ స్వర్ణ లింగాన్ని పూజిస్తారు. విష్ణుమూర్తి మదిలో నెలకొన్న లక్ష్మీదేవి నేతితో చేయబడిన లింగాన్ని పూజిస్తుందని.. సరస్వతీ మాత కూడా బ్రహ్మ వలే స్వర్ణ లింగాన్నే పూజిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
ఇకపోతే.. దేవతాధిపతి అయిన ఇంద్రుడు పద్మరాగ లింగాన్ని.. నీతిమంతుడు ధర్మజుడు అయిన యమధర్మరాజు గోమేధిక లింగాన్ని, వాయుదేవుడు.. ఇత్తడి లింగాన్ని.. చంద్రుడు.. ముత్యపు లింగాలను పూజిస్తారు. అశ్వినీదేవతలు మట్టితో చేయబడిన లింగాలను.. నాగులు.. పగడపు లింగాన్ని పూజిస్తారు. ఇక సకలసంపదలకు అధిపతి అయిన కుబేరుడు కూడా తనకు తాత అయిన బ్రహ్మ (బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు కుబేరుడు)వలె స్వర్ణ లింగాన్ని పూజిస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.