గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (17:31 IST)

శివునికి బియ్యం పిండి, తేనెతో అభిషేకం చేయిస్తే.. ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా?

శివుడు అభిషేక ప్రియుడనే విషయం తెలిసిందే. మహేశ్వరుడికి బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధ నుంచి విముక్తులవుతారని పండితులు చెప్తున్నారు. అలాగే టెంకాయ నీటితో శివునికి అభిషేకం చేయిస్తే కుటుంబ సభ్య

శివుడు అభిషేక ప్రియుడనే విషయం తెలిసిందే. మహేశ్వరుడికి బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధ నుంచి విముక్తులవుతారని పండితులు చెప్తున్నారు. అలాగే టెంకాయ నీటితో శివునికి అభిషేకం చేయిస్తే కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. చెరకు రసంతో శివునికి అభిషేకం చేయిస్తే.. శత్రుబాధ ఉండదు.


అలాగే ఖర్జూర పండ్లతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, శత్రువైరాలుండవు. ఆరోగ్యంతో పాటు సంపద సిద్ధిస్తుంది. శివునికి విభూతితో అభిషేకం చేయిస్తే.. ఉద్యోగం ప్రాప్తిస్తుంది. నిమ్మరసంతో అభిషేకం చేయిస్తే.. మృత్యుభయం తొలగిపోతుంది. కొబ్బరిపాలతో శివునికి అభిషేకం చేయిస్తే.. సుఖమయ జీవితం లభిస్తుంది. 
 
అలాగే.. ఆవు పాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభిస్తాయి. 
ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగును
నువ్వుల నూనెతో అభిషేకం చేసినా అపమృత్యువు నశించగలదు.
పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యముతో పాటు సంతానం పొందవచ్చు.
పంచామృతంతో అభిషేకం చేయిస్తే కుటుంబ సభ్యులతో కలసిమెలసివుంటారు.
తేనెతో అభిషేకం చేయిస్తే అప్పులు, కుటుంబ కలహాలు తీరిపోతాయి. 
కస్తూరి కలిపినా నీటిచే అభిషేకం చేసిన కీర్తి పెరుగును
పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళ ప్రదము జరుగును, శుభకార్యాలు జరుగుతాయి.
మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించును
గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు.
పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును
రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములను పొందవచ్చునని పండితులు చెప్తున్నారు.