శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 16 జులై 2014 (14:37 IST)

శ్రీకృష్ణుడు - రుక్మిణీల ప్రేమ కథ

విదర్భ రాజు కుమార్తె రుక్మిణి. శ్రీకృష్ణుని శౌర్య పరాక్రమాలను ఆమె తెలుసుకున్నది. కృష్ణుని అల్లునిగా చేసుకోవాలని రుక్మిణి తండ్రి తలపోశారు. కానీ జరాసంధుని కారణంగా వారిరువురి ఆశలకు అటంకం కలిగింది. ఇక్కడ రుక్మిణీ మనసా వాచా కర్మణా శ్రీకృష్ణుని తన పతిదేవునిగా ప్రేమించి పూజించసాగింది. 
 
అక్కడ శ్రీకృష్ణుడు సైతం రుక్మిణి గుణ రూప లావణ్యాలను తెలుసుకుని ఆమెపై అనురాగాన్ని పెంచుకున్నాడు. ఇరువురి హృదయాలు ఒక్కటయ్యే సమయం ఆసన్నమైంది. తన స్వప్నాలలో శ్రీకృష్ణుని వీక్షిస్తున్న రుక్మిణీ తన హృదయ సీమను ఏలుతున్న నందగోపాలునికి తన ప్రేమను వ్యక్తీకరించాలని తహతహలాడసాగింది. ఆ మేరకు ఒక ప్రేమ సందేశాన్ని శ్రీకృష్ణునికి పంపింది. 
 
తన సోదరుడు బలరామునితో కలిసి రుక్మిణిని అపహరించేందుకు శ్రీకృష్ణుడు విచ్చేశాడు. అపహరణ ఘట్టానికి రుక్మిణీ పూర్తి స్థాయిలో సహకరించింది. అపహరించిన అనంతరం ఆమెను వివాహమాడిన శ్రీకృష్ణుడు, తన భార్యలలో అగ్రస్థానాన్ని రుక్మిణికి కట్టబెట్టి తన ప్రేమను చాటుకున్నాడు. యుగాలు గడిచినా, కాలం మారినా వారిరువురి ప్రేమ కథ జగద్వితమై అందరి హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.