శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (09:48 IST)

నేడు మాఘ పౌర్ణమి.... ఈ పౌర్ణమి విశేషం ఏమిటంటే?

నేడు మాఘ పౌర్ణమి. దీనినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం గానీ, నదీ స్నానం గానీ చేయాలి. దేవతలు తమ సర్వ శక్తులను

నేడు మాఘ పౌర్ణమి. దీనినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది.  ఈ రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం గానీ, నదీ స్నానం గానీ చేయాలి. దేవతలు తమ సర్వ శక్తులను – తేజస్సులను మాఘ మాసంలో  జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా మంచిది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులోగానీ, లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం. 
 
స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి నమస్కరించాలి. వైష్ణవ ఆలయానికి గానీ, శివాలయానికి గానీ వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగులు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. ఈ విధంగా చేయడం వలన జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు- దోషాలు నశించి, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా తెలుస్తోంది. 
 
మాఘపౌర్ణమి రోజున చేసే స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. “గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు” అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.