శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 ఫిబ్రవరి 2015 (18:25 IST)

మహాశివరాత్రి: శని, సర్ప దోషాలు తొలగిపోవాలంటే?

ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కుజ, సర్ప, కాలసర్ప, నర దృష్ట్యాది సమస్త భయంకర దోషాలు తొలగిపోవాలంటే.. మహాశివరాత్రి రోజున సుప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకోవడం ఉత్తమమని పురోహితులు అంటున్నారు. 
 
ముఖ్యంగా పవిత్ర కాశీ, రామేశ్వరంలో ప్రత్యేక పూజలు చేయించేవారికి శని, సర్ప దోషాలు తొలగిపోతాయి. ఇంకా కాశీ విశ్వేశ్వర స్వామి, రామేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి సిద్ధిస్తుంది. 
 
కాశీలో ఫిబ్రవరి 17వ తేదీ (మహాశివరాత్రి) లక్ష్మీగణపతి హోమము, రుద్రాహోమము, నవగ్రహ హోమములు వంటి వివిధ పూజలు చేయించే వారి ఇంట్లో ధన, కనక, వస్తు, వాహనములకు, ఆయురారోగ్యములకు అన్నవస్త్రములకు లోటు అనేది ఉండదని పండితులు చెబుతున్నారు.