శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2014 (18:44 IST)

ఇంటి గడపపై తలపెట్టుకుని నిద్రపోవచ్చా?

ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూర్వం ఎవరైనా పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకి 'బొట్టు' పెట్టేసి వెళుతుంటారు. దీనిని బట్టి గడపకి ఎంతటి ప్రాధాన్యత వుందో అర్థం చేసుకోవచ్చు. 
 
గడపని శుభ్రంగా ఉంచడం ... పసుపురాసి కుంకుమ బొట్లు పెడుతూ వుండటం ప్రాచీనకాలం నుంచి వస్తోంది. అలాంటి గడపపై కూర్చున్నా... నిల్చున్నా... గడపపై తలపెట్టి పడుకున్నా మంచిది కాదని పురోహితులు అంటున్నారు. 
 
గడపపై తలపెట్టి పడుకుని ఏవో పుస్తకాలు చదువుతూ వుంటారు ... అవసరమైతే అలాగే పడుకుంటారు. ఈ పద్ధతి ఎంతమాత్రం మంచిదికాదని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
గడప శ్రీమన్నారాయణుడి స్థానం... నరసింహస్వామిగా గడపపైనే కూర్చునిృహిరణ్యకశిపుడిని వధించడం జరిగింది. ఇక నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై వుంటుంది. 
 
అందువలన గడప లక్ష్మీదేవి స్థానంగా కూడా చెప్పబడుతోంది. ఈ కారణంగానే గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తూ వుంటారు. అందువల్లనే గడపపై కూర్చోవడం ... నుంచోవడం ... తలపెట్టి పడుకోవడం వంటివి చేయకుండా, దానిని పవిత్రంగా చూసుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు.