గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (19:05 IST)

పండ్లు కుళ్ళినట్లు కల వస్తే..?

పండ్లు కుళ్ళినట్లు కల వచ్చినట్లైతే దారిద్ర్య బాధ కలుగును. పండ్లు పండు కాలమునందు పండ్లు కలలోకి వచ్చినట్లైతే ఆ పండ్లు పచ్చిగా ఉన్నట్లైతే రోగములు కలుగును. పండ్లు విస్తారముగా ఉండి వాటిని పోగుచేసినట్లు కల వచ్చినచో ధనలాభము కలుగును. 
 
వయసు ఎక్కువగా వున్న చెట్టు నుండిగాని, వాడిపోయిన చెట్టు నుండి రాలిన పండ్లను పోగుచేసినట్లు కల వచ్చినచో వయసు మళ్ళిన బంధువుల నుంచి ధనము రాబడుదురు. చెట్టునకు పండ్లు, పువ్వులు నిండుగా ఉన్నట్లు కలవస్తే ధనధాన్యములు సమృద్ధిగా ఉండును.