శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 25 మే 2016 (17:15 IST)

ప్రియా నా పంచ ప్రాణాలు నీవే అంటాడు ప్రియుడు... ఇంతకీ పంచ ప్రాణాలు ఏమిటి..?

పంచ ప్రాణాలు అనే మాటను మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఈ డైలాగ్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇంతకీ పంచప్రాణాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. పంచ ప్రాణాల పేర్లు... 1. ప్రాణము, 2. అపానము, 3. సమానము, 4. ఉదానము, 5. వ్యానము. ఇప్పుడు వాటి గురి

పంచ ప్రాణాలు అనే మాటను మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఈ డైలాగ్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇంతకీ పంచప్రాణాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. పంచ ప్రాణాల పేర్లు... 1. ప్రాణము, 2. అపానము, 3. సమానము, 4. ఉదానము, 5. వ్యానము. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
 
1) ప్రాణము... ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించిఉన్న శ్వాశకోశాన్ని జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుందని చెప్పబడింది. మన వాక్కును, మ్రింగటాన్ని, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతూ శరీరంలో ఊర్ధ్వచలనం కల్గి ఉంటుందని తెలియజేయబడింది.
2)  అపానము... నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తి చెంది అధోచలనం కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని ఇది నిర్వర్తిస్తుంది.
3) సమానము... ఇది నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుందన్నమాట.
4) ఉదానము... ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఇది సహాయపడుతుంది. మనలోనుండి శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదపడుతుందన్నమాట.
5) వ్యానము... ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచుతుంది. శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మనాడులున్నట్లు చెపుతారు. ఇవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ ఉన్నట్లు పెద్దలు చెబుతారు. ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు అని చెప్పారు.