శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (13:26 IST)

పూజలో కొబ్బ రికాయ కుళ్ళితే మంచిదా? కాదా?

పూజలో కొట్టిన కొబ్బరి కాయ కుళ్ళితే దోషమేమి కాదంటున్నారు పండితులు. అపచారం అంతకన్నా కాదంటున్నారు. తెలిసి చేయడం లేదు కనుక కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్ఛారణ చేసి స్

పూజలో కొట్టిన కొబ్బరి కాయ కుళ్ళితే దోషమేమి కాదంటున్నారు పండితులు. అపచారం అంతకన్నా కాదంటున్నారు. తెలిసి చేయడం లేదు కనుక కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్ఛారణ చేసి స్వామికి అలంకరిస్తారు. అంటే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కానీ ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.
 
అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుక్కుని పూజా మందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించడం మంచిది. వాహనాలకి కొట్టే కాయ కుళ్ళితే దిష్టి అంతా పోయినట్లే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలని చెబుతున్నారు పండితులు.