శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2014 (18:39 IST)

నేను కోరుకునేది ఏదీ దక్కడం లేదే? ఏం చేయాలి?

నేను కోరుకునేది ఏదీ దక్కడం లేదే? ఏం చేయాలి? సద్గురూ.. ఈ సృష్టిలో ఏ శక్తి మీకు వ్యతిరేకమైంది కాదు. మీరు ఉపయోగించుకోవడాన్నిబట్టే ఒక శక్తి మీకు లాభానికో, నష్టానికో, సృష్టికో, విధ్వంసానికి కారణం అవుతుంది. 
 
ఒక రోజు సూర్యోదయాన్ని ఫోటో తీయాలనుకుంటారు. ఆ రోజు ఒకటే మబ్బులు, ముసురు వాన పడుతుంది. మీ కోరిక నెరవేరలేదన్న కోపంతో, ప్రకృతి మీద అయిష్టంతో, మీ గదిలో ఓ మూల ముణుచుకుని కూర్చున్నంత మాత్రాన ప్రకృతి మారుతుందా?
 
అది కాదు మీరు చేయాల్సింది. ఆ వానను ఆసక్తిగా గమనించండి. ఒక అద్భుతమైన హరివిల్లు కనబడి మీకు ఆనందాన్నివ్వవచ్చు. ఎప్పుడో తప్ప కన్పించని పొగమండలం ఏర్పడవచ్చు. లేదా ఇంటిపని చేసుకోడానికి అదో మీకు అవకాశం అనుకోండి. 
 
ఒక బలమైన శక్తివల్ల మీరు అనుకున్నది జరగకుండా పోవచ్చు. అయితే చెయ్యదగ్గ, చేయగలిగినవాటిని చేయకుండా డీలాపడిపోవడం, చేతకానితనం, పిచ్చితనం అవుతుంది.