శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (15:45 IST)

సప్త ఋషులలో మూడో మహర్షి గురించిన వివరాలేంటి?

సప్త ఋషులు. 1. వశిష్టుడు 2. ఆత్రి 3. గౌతముడు 4. కశ్యపుడు 5. భరద్వాజుడు 6. జమదగ్ని 7. విశ్వామిత్రుడు.
 
సప్త ఋషులలో మరొకరు ఆంగిర మహర్షి. జ్ఞానం, భక్తి, కర్మ. ఈ మూడింటి సమన్వయంతో జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిందిగా చెప్పిన మహానుభావుడు. తీవ్రంగా తపస్సు చేసి అపారమైన తేజస్సు పొందిన తాపసి. ఈయన ముందు అగ్ని దేవుని తేజస్సు ఒక దీపపు వెలుగుగా కనిపిస్తుంది. పీడితుల విముక్తి కోసం తన పాండిత్యాన్ని పదిమందికీ పంచిన వ్యక్తి అంగిర. 
 
ఆత్మ, పరమాత్మ, పంచభూతాలు, సంసార సాగరానికి సంబంధించి అనేక విషయాల్ని తన ఉపదేశాల ద్వారా శ్రమద్భాగవతాన్ని ఆధారం చేసుకుని అర్థవంతంగా చెప్పిన మహాఋషి. "బ్రహ్మ సూత్రము, మూడోపనిషత్తు" వంటి అద్భుతమైన రచనల్లో అంగిర మహర్షి తెలిపిన విషయాలు భారత ఆధ్యాత్మిక సంపదకు ఆధారాలు.