గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (15:35 IST)

శివలింగాల పూజ-విశిష్టత: ముక్తికోసం.. కర్పూర లింగాన్ని..?

పరమేశ్వరుడు భూలోకానికి లింగరూపంలో దర్శనమిస్తాడు. సాధారణంగా శైవక్షేత్రాల్లో నల్లరాయి, తెలుపురాయితో శివలింగాలు దర్శనమిస్తుంటాయి. భక్తులు ఆ స్వామిని అనునిత్యం పూజించుకోవడానికి గాను తమ పూజామందిరంలో బంగారు, వెండి, ఇత్తడి, స్పటికతో చేయబడిన వివిధరకాల శివలింగాలను ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. 
 
ఇక వివిధరకాల పదార్థాలతో చేయబడిన శివలింగాలను ఆరాధించడం వలన కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయనీ, ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని చెప్పబడుతోంది.
 
ఇలా మట్టితోను, ఆవుపేడతోను, బెల్లంతోను, పిండితోను చేయబడిన శివలింగాలలో ఒక్కొక్కటి ఒక్కో విశేషమైన పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ఇలా తమ మనోభీష్టానికి తగినట్టుగా భక్తులు ఆ శివలింగానికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇలా కర్పూరంతో చేసిన శివలింగాన్ని పూజించడం ద్వారా ముక్తిని ప్రసాదించవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.