గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (18:21 IST)

భైరవుడి గొప్పతనం..? మంత్ర తంత్ర సాధనకు కాలభైరవుడు సహకరిస్తాడా?

భైరవునికి గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే? ఈ స్టోరీ చదవాల్సిందే. భైరవుని శివుని ప్రతిరూపం అంటారు. ప్రాచీన శివాలయాల్లో భైరవ విగ్రహానికి ప్రత్యేకత వుంటుంది. శునకవాహనముతో కూడిన ఈ భైరవుడు.. వారణాసి శివాలయానికి క్షేత్రపాలకుడిగా కీర్తించబడ్డాడు.

మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలనుకున్నా ముందు భైరవుని అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర తంత్ర మూర్తిగా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామంలో కాలభైరవుడికి ప్రత్యేక ప్రాధాన్యముంది. ఆదిశంకరాచార్యులవారు కాలభైరవాష్టకాన్ని రచించారు. 
 
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం 
వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం 
నారదాది యోగిబృంద వందితం దిగంబరం 
కాశికా పురాధినాధ కాలభైరవం భజే!
 
దేవతా వాహనాలు ఆయా దేవతల మూల తత్వాన్ని సూచిస్తాయి. సింహం దుర్గకు వాహనం. ఇది ప్రకృతిలో రాజసిక శక్తికి చిహ్నం. ఇక కాలభైరవునికి శునకం వాహనం. అంటే భక్తానుగ్రహాన్ని, అతీంద్రియమైన శక్తులను భైరవుడు ప్రసాదిస్తాడని అర్థం. దేవాలయాల్లో ఆయనకి గారెలతో మాల, కొబ్బరి, బెల్లం నైవేద్యం పెడతారు. కాలమే ఆయనకు జగన్మూలం. కాలాన్ని జయించడం సాధ్యం కాకపోయినా.. దానిని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహ బలాన్ని అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో సాధ్యమవుతుంది. 
 
కాలభైరవుడిని, నేపాల్, హిమాలయాల్లో పూజిస్తారు. స్వర్ణాకర్షణ భైరవుడు నేపాల్‌లో కొలువై వున్నాడు. ఆయన పేరుకు తగినట్లు ధన సమృద్ధిని, రుణ విముక్తిని ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యం జ్ఞాన వైరాగ్యాలకి ఆయనే అత్యంత సన్నిహితుడు కారకుడు. వ్యాఖ్యాన ముద్రతో వుంటాడు సృష్టిని వ్యాఖ్యానించగల శక్తి భైరవుడికి వుంటుంది. అలాంటి మహిమాన్వితమైన భైరవుడిని కాలం తమకు అనుకూలించాలని కోరుకుందాం.