బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 నవంబరు 2015 (17:23 IST)

పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మేలేంటి?

పౌర్ణమి రోజున పూజలు, వ్రతాలు విశిష్టమైన ఫలితాలినిస్తాయి. ప్రతి మాసంలోను పౌర్ణమి విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ముఖ్యంగా ఆశ్వయుజ పౌర్ణమి రోజున చేయబడే లక్ష్మీదేవి ఆరాధన కూడా అనంతమైన ఫలితాలు ఇస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
ఈ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తే, పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరిసంపదలను ప్రసాదిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయడం వలన, ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయన్నారు.
 
పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ, తన వ్రతాన్ని ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి, సిరి సంపదలు చేకూరతాయి. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయండి.