గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 మార్చి 2015 (19:38 IST)

మంచిపై మాటల దాడి.. భగవంతునికి నచ్చదట!

సున్నితమైన మనసున్నవారికి కొంతమంది అమాయకులనే ముద్రవేస్తారు. వాళ్లని బాధపెడతారు. అలాంటివాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే.. అవతలివాళ్లు రాక్షసానందాన్ని పొందుతారు. ఇలా మంచితనంపై మాటల దాడిచేయడం ... మానవత్వంగల మనుషులను బాధపెట్టడం మహాపాపమని పురాణాలు చెబుతున్నాయి. మంచివారిని బాధపెట్టడం వలన ఆ మంచితనం కారణంగానే వాళ్లు ఏమీ అనలేకపోవచ్చు. కానీ అలాంటివారిని మానసికంగా హింసించడం వలన, వారిని రక్షిస్తూ వస్తోన్న భగవంతుడు మాత్రం క్షమించడు.
 
ఇతరులకి సాయపడే మనస్తత్వమున్నవారిని భగవంతుడు కాపాడుతూ రావడం, అలాంటివారిని బాధించేవారిని శిక్షిస్తూ రావడం పురాణకాలం నుంచీ వుంది. మంచి చేయకపోయినా ఫరవాలేదు కానీ, మంచివారి పనులకు అడ్డుతగలడం ... వారిని మాటలతోను .. చేతలతోను హింసించడం చేయకూడదు. అలా కాదని తమదైన ధోరణిని కొనసాగిస్తే తగిన ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.