శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 16 మే 2018 (17:30 IST)

జీవితమంతా యాతనలు పడ్డాక ఆ రహస్యం తెలుస్తుంది

ఈ జీవితం క్షణికం. ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఇతరుల కొరకు జీవించే వారే యధార్థంగా జీవిస్తున్నవారు. తక్కినవారు జీవన్మృతులు. 2. లోకంలో సదా దాతవై వర్ధిల్లు. సహాయం-సేవ చేయి, నీవు ఇవ్వగలిగిన ఏ అల్ప వస్తువునైనా ఇవ్వు. వస్తు మార్పిడి పద్ధతికి దూరంగా ఉండు.

ఈ జీవితం క్షణికం. ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఇతరుల కొరకు జీవించే వారే యధార్థంగా జీవిస్తున్నవారు. తక్కినవారు జీవన్మృతులు.
 
2. లోకంలో సదా దాతవై వర్ధిల్లు. సహాయం-సేవ చేయి, నీవు ఇవ్వగలిగిన ఏ అల్ప వస్తువునైనా ఇవ్వు. వస్తు మార్పిడి పద్ధతికి దూరంగా ఉండు.
 
3. ఈ ప్రపంచం అనే నరకంలో ఏ ఒక్క హృదయంలో ఏ కాస్తయినా శాంతి సౌఖ్యాలు కలిగించగలిగితే అదే సత్కర్మ అనిపించుకుటుంది. జీవితమంతా యాతనలు పడ్డాక ఈ రహస్యం తెలుస్తుంది. తక్కినదంతా కేవలం బూటకం.
 
4. నాయనా.. మృత్యువు అనివార్యమైనపుడు, రాళ్లు రప్పల్లాగా ఉండటం కంటే ధీరుల్లాగా మరణించటం శ్రేయస్కరం కాదా.. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమేముంది. తుప్పు పట్టేకంటే, ఈషణ్మాత్రమైనా పరులకు మేలు చేయటంలో అరిగిపోవటం మంచిది.
 
5. కోరికలన్నింటిని విడనాడి, సుఖభోగాలను త్యజించిన విశాల హృదయులైన స్త్రీపురుషులు వందలకొద్దీ ముందుకు వచ్చి పేదరికం, అజ్ఞానం అనే సుడిగుండంలో పడి నానాటికీ కృంగి, కృశించి, అణగారిపోతున్న లక్షలాది స్వదేశీయుల సంక్షేమ నిమిత్తం, అపరిమితమైన ఆ కాంక్షతో, తమ సర్వశక్తిని ధారపోసి, కష్టించి పని చేస్తేనే భారతజాతి జాగృతం కాగలదు.