Widgets Magazine

శుద్దభక్తి అంటే ఏమిటి? ఎలా వుండాలి?

గురువారం, 30 ఆగస్టు 2018 (21:55 IST)

భగవంతుని పట్ల భక్తి ఉన్నదని మానవుడు భ్రమపడుతుంటాడు. కోరికలు తీరినప్పుడు సంతోషిస్తూ, అవి నెరవేరనప్పుడు దుఃఖిస్తూ ఉంటాడు. కోరికలు తీరనప్పుడు భగవంతుడిని శంకిస్తాడు. కానీ లౌకిక విషయాల పట్ల ఉన్నంత వ్యామోహం భగవంతుని మీద ఉండదు. ఆ విషయం మానవుడు అంత త్వరగా అర్థం చేసుకోలేడు. భగవంతుని మీద శుద్దభక్తి ఉన్నవాడు మాత్రమే తరిస్తాడు. శుద్దభక్తి అంటే ఎలా ఉండాలంటే మానవుడికి భగవంతుణ్ణి దర్శించడమొక్కటే కావలసినది. 
temple
 
ధనం, కీర్తి దేహ సుఖాలు మొదలైనవి ఏమీ వద్దు అనే భావం ఉండాలి. ఇలాంటి భావాన్నే శుద్దభక్తి అంటారు. అదెలాగంటే... ఒకసారి అహల్య రాముడితో ఇలా అంది. ఓ రామా.... నేను పందిగా జన్మించినా సరే, దాని గురించి నాకు ఎలాంటి చింతా లేదు. కానీ నాకు నీ పాదపద్మాల పట్ల శుద్దభక్తి కలిగేలా మాత్రం అనుగ్రహించు, అన్యంగా నేనేమీ కోరను.
 
ఓ రోజు సీతారాములను దర్శించి నారదుడు వారిని స్తోత్రపాఠాలతో స్తుతించసాగాడు. రాముడు వాటితో సంతుష్ఠుడై నారదా.... నేను నీ స్తోత్రపాఠాలతో సంప్రీతుడనైనాను. నువ్వు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు నారదుడు ఇలా అన్నాడు. ఓ రామా... నువ్వు నాకు వరం ఇచ్చి తీరవలసినదే అంటే నాకు ఈ వరాన్ని ప్రసాదించు- నీ పాద పద్మాల పట్ల నాకు శుద్దభక్తి కలిగేలా చెయ్యి అన్నాడు. అప్పుడు రాముడు ఇంకా వేరేమయినా కోరుకో అన్నాడు. అందుకు జవాబుగా నారదుడు నేను వేరే ఏమీ కోరుకోను. నేను కేవలం నీ పాదపద్మాల పట్ల శుద్దభక్తిని మాత్రమే కోరుకుంటాను అన్నాడు. 
 
శుద్దభక్తిలో ఆనందం ఉంటుంది. కానీ అది విషయానందం కాదు. అది భక్తి వల్ల కలిగే ఆనందం, ప్రేమానందం. సద్భక్తుడు ఇలాంటి భక్తిని ప్రసాదించమని భగవంతుడిని మనస్పూర్తిగా వేడుకోవాలి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

దేవదేవతలకు వాహనాలివే...

దేవాలయాలు పవిత్రతకు, ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తుంటాయి. ఏ దేవాలయానికి వెళ్లినా ఆ ...

news

కృష్ణాష్టమి రోజున భీష్మాచార్యులను పూజిస్తే..?

శ్రీకృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడినే కాదు.. భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు ...

news

అమావాస్య పుష్యమి నక్షత్రం రోజూ ఇలా పూజలు చేస్తే..?

అపురూపమైన ఆధ్యాత్మిక వస్తువులలో శ్వేతార్క మూలం చాలా విశిష్టమైనది. ఇక్కడ శ్వేతార్కమూలం ...

news

శ్రీకృష్ణాష్టమి రోజున పూజ.. గోదానం చేసిన ఫలితాన్నిస్తుందట..

శ్రీకృష్ణాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతాన్ని ఆచరిస్తే గోదానం చేసిన ...

Widgets Magazine