గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 13 ఆగస్టు 2014 (19:01 IST)

ఆధ్యాత్మిక చింతన జీవనానికి అడ్డంకి అవుతుందా..?

ఆధ్యాత్మిక చింతన అనేది మనసుకు సంబంధించినది. నువ్వు బయట ఏం చేస్తుంటావనే దానికి సంబంధం లేనిది. నిత్యజీవనాన్ని ఒక పద్ధతిలో గడుపుతారు. ఆ క్షణంలో ఉన్న పరిస్థితికి అనుకూలంగా స్పందిస్తారు. కుటుంబ జీవితంలో, వృత్తిలోనూ అంతే. 
 
ఇక ఆధ్యాత్మికత అనేది మనసుకు సంబంధించినది. ఆధ్యాత్మిక చింతన అనేది అడవుల్లో, కొండ గుహల్లో కూర్చుని సాధించాల్సి ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. పర్వతాల్లో, అడవుల్లో మాత్రమే దొరికేటట్లయితే అది మీ గొప్ప కాదు. ఆ పర్వతాల, అడవుల విశేషత అవుతుంది. 
 
నలుగురిలో నివసిస్తూనే మానసిక ప్రశాంతత సాధించగలిగితేనే గొప్ప. కాబట్టి మీరు జీవితంలో ఏ వృత్తి సాధిస్తున్నారు, ఎలా ఉంటారు అనేది అనవసరం. ధైర్యంగా ఆధ్యాత్మికత చింతనలోకి వెళ్లండి. ఒకవేళ ఆ చింతన మీ జీవితంలో మార్పు తెచ్చినా అది మంచికే అవుతుంది కానీ, చెడుకు కాదు.