మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (19:08 IST)

సూర్యభగవానుడిని ఏ పుష్పాలతో పూజించాలో తెలుసా?

లోకులకు వెలుగును ప్రసాదించే సూర్యదేవుడిని ఏ పుష్పాలతో పూజించాలో మీకు తెలుసా? అయితే ఈ కథనం చదవండి. లోకాలకు వెలుగును, జీవులకు చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆయన కదలికలపైనే సమస్త జీవకోటి ఆధారపడి వుంటుంది. అందుకే రుషి గణాలు ... దేవతలు ఆ స్వామిని ప్రతినిత్యం పూజిస్తూ ... సేవిస్తూ వుంటారు.
 
అలాంటి సూర్య భగవానుడికి దోసిటతో అర్ఘ్యం వదిలి ఓ నమస్కారం సమర్పిస్తే సంతృప్తి చెందుతాడు. ఒకవేళ ఆ స్వామిని పువ్వులతో పూజించాలనుకుంటే, ఆయనకి ఇష్టమైన పువ్వులతో పూజించి అనుగ్రహం పొందవచ్చు. 
 
ఆ పువ్వులు ఏంటంటే మందారాలు, సంపెంగలు, పున్నాగ పుష్పాలు, గన్నేరులు, తామర, జాజులు, గులాబీలు, నాగకేసారాలు, మొల్లలు, మొగలి పూలు, మోదుగలు, విష్ణు తులసి, కృష్ణ తులసి సూర్య భగవానుడుకి అత్యంత ప్రీతికరమైనవి. ఇక ముళ్ళతో కూడిన పూలు, సువాసన లేని పూలు, నల్ల ఉమ్మెత్త పూలు, గురివింద పూలు సూర్యుడి పూజకు పనికి రావని పండితులు అంటున్నారు.