శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: శనివారం, 26 నవంబరు 2016 (13:14 IST)

స్వచ్ఛ తిరుమల... 10 స్వచ్ఛ ఆదర్శనీయ ప్రాంతాల్లో తిరుమల ఒకటి...

రోజూ 60 వేల నుంచి లక్షమంది భక్తులు వస్తున్నా.. తిరుమలను అద్దంలా ఉంచడంలో తితిదే తీసుకుంటున్న చర్యలు యావత్‌ దేశాన్ని ఆకట్టుకుంటున్నాయి. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని కేంద్రం ఇటీవలే ప్రకటించినా దానితో నిమిత్తం లేకుండా ఎప్పటి నుంచో తిరుమలలో పారిశుధ్యానికి

రోజూ 60 వేల నుంచి లక్షమంది భక్తులు వస్తున్నా.. తిరుమలను అద్దంలా ఉంచడంలో తితిదే తీసుకుంటున్న చర్యలు యావత్‌ దేశాన్ని ఆకట్టుకుంటున్నాయి. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని కేంద్రం ఇటీవలే ప్రకటించినా దానితో నిమిత్తం లేకుండా ఎప్పటి నుంచో తిరుమలలో పారిశుధ్యానికి పెద్దపీట వేస్తోంది దేవస్థానం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలో పారిశుధ్య నిర్వహణ కోసం యేటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అందుకే అందరు యాత్రికులు లాగే తిరుమలను సందర్సించిన స్వచ్ఛభారత్‌ అధికారులు ముగ్ధులయ్యారు.
 
స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా 10 స్వచ్ఛ ఆదర్శనీయ ప్రాంతాను కేంద్రం ఇటీవల ఎంపిక చేసింది. ఇందులో తిరుమలతో పాటు జమ్మూకాశ్మీర్‌లోని శ్రీ వైష్ణోమాత ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌ మహల్‌, పంజాబ్‌లోని స్వర్ణదేవాయం, రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గా, ఒడిశాలోని శ్రీ జగన్నాథ ఆలయం, మహారాష్ట్ర ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌, ఉత్తరప్రదేశ్‌లోని మణికర్ణిక ఘాట్‌, మధురైలోని శ్రీ మీనాక్షి ఆలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య ఆలయం ఉన్నాయి. 
 
ఈ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశుధ్య నిర్వహణ జరగాలన్నది కేంద్రం యోచన, ఈ కార్యక్రమం ఎలా అమలవుతుందో సమీక్షించేందుకు 8 రాష్ట్రాలకు చెందిన 70 మంది ప్రతినిధులు గత వారం తిరుపతిలో సమావేశమయ్యారు. అనంతరం తిరుమలను సందర్శించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల సందర్శనం కోసం రోజూ వేలాదిమంది భక్తులు వస్తున్నా పరిశుభ్రత విషయంలో మెరుగైన ప్రమాణాలు పాటిస్తూ స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తోంది. కేంద్ర తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి పరమేశ్వరన్‌ అయ్యర్ అభినందించారు. 
 
స్వచ్ఛ ఆదర్శనీయ ప్రాంతంగా గుర్తింపు పొందిన తిరుమలను మరింత అభివృద్థి చేసేందుకకు 26 కోట్లతో తితిదే ప్రతిపాదనలు సిద్థం చేసింది. ఓఎస్‌జిసి, కోల్‌ ఇండియా, నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్పొరేట్‌ సామాజికక బాధ్యతగా తిరుమలలో అభివృద్థి పనులకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందించనున్నాయి. ఉన్నత ప్రమాణాలతో సేవలు అందిస్తున్నారు. తిరుమలను అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా సాలిడ్‌ లిక్విడ్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ పవన, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ ఆధునీకరణ తదితర పనులు చేపట్టనున్నారు. దీంతో తిరుమల మరింత స్వచ్ఛంగా మారనుంది.