బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (14:06 IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శ్రీవారి భక్తుడే!

ఏంటిది. ప్రపంచంలో హిందువుగా ఉన్న ఎవరైనా సరే తిరుమల శ్రీవారిని ప్రార్థించి తీరుతారు. అలాంటిది పక్క తెలుగు రాష్ట్రంలో ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీవారి భక్తుడే అంటారేంటి అనుకుంటున్నారా.. అక్కడే

ఏంటిది. ప్రపంచంలో హిందువుగా ఉన్న ఎవరైనా సరే తిరుమల శ్రీవారిని ప్రార్థించి తీరుతారు. అలాంటిది పక్క తెలుగు రాష్ట్రంలో ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీవారి భక్తుడే అంటారేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది.. అసలు మెలిక. రాష్ట్రం విడిపోక ముందైనా, విడిపోయిన తర్వాతైనా కేసీఆర్‌కు తిరుమల శ్రీవారు అంటే ఎంతో భక్తి. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే శ్రీనివాసుడికి అత్యంత పరమభక్తుడు. అయితే ప్రస్తుతం తితిదే ఆస్తులు తెలంగాణాకు వాటా రావాలని చిలుకూరు స్వామి వేసిన పిటిషన్‌ పెద్ద దుమారాన్నే రేపుతోంది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తెలంగాణాకు వాటా రావాలని కొందరు అడగవచ్చుగానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు (కెసిఆర్‌) ఆ మాట అంటారని అనుకోలేం. ఎందుకంటే ఆయన కూడా శ్రీవారి భక్తుడే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్వామివారికి 5 కోట్ల రూపాయలకుపైగా విలువచేసే ఆభరణాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కలలను సాకారం చేసుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేసీఆర్ ఏడుకొండలవాడి మ్రొక్కు తీర్చుకోవాలని భావించారు.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీనివాసునికి తామర పూల నమూనాతో కూడా బంగారు సాలిగ్రామ హారాన్ని, 5 పేటల కంటెను సమర్పించాలనుకున్నారు. వీటి తయారీ కోసం 29.02.2016న ఆ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్లను తితిదేకి జమ చేసింది. మొత్తం 19072 గ్రాముల బరువుండే ఈ ఆభరణాలను తితిదే తయారు చేయిస్తోంది. దీనికి సంబంధించి టెండర్లు పిలిచింది. టెండరు ప్రకటనను పత్రికల్లో ప్రచురించడం సహా మొత్తం 5 కోట్ల 2 లక్షల 79 వేల 170 రూపాయలు ఖర్చవుతుంది. ఆభరణాల తయారీ పూర్తయిన తరువాత కేసీఆర్ స్వయంగా తిరుమలకు వచ్చి స్వామివారికి సమర్పించుకున్నారు. ఇలా మ్రొక్కు తీర్చుకుంటున్న కేసీఆర్‌ తితిదే ఆదాయం నుంచి వాటా ఆశిస్తారని అనుకోలేం. మరి ఈ విషయంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ఎలా స్పందింస్తారనేది ఆశక్తిగా మారింది.