గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (17:12 IST)

గంట కొట్టుచున్నట్లు కల వచ్చినట్లైతే..

గంట కొట్టుచున్నట్లు కల వచ్చినట్లైతే త్వరలో వివాహము జరుగును. శుభవర్తమానము విందురు. గోధుమలు గానీ, గోధుమలు పండే  పొలములను గానీ కలలో చూసినట్లైతే ధనలాభము, వాహన లాభము, భార్యా సౌఖ్యము, సంతోషము కలుగును. కోర్టు వ్యవహారములో జయము కలుగును. 
 
గోరీ మీద వ్రాసిన శాసనము చూచినట్లు కల వచ్చినట్లైతే చిరకాల మరియు అపరిచిత స్నేహితుని వల్ల మేలు కలుగును. గోళ్ళు పొడవుగా ఎదిగినట్లు కల వచ్చినట్లైతే ధనలాభము, ఆనందము కలుగును. చలిమంట కాగుతున్నట్లు కల వచ్చినట్లైతే, కలలో పుస్తకము చదువుతున్నట్లు వర్తక వ్యాపారములు అభివృద్ధి, జయము కలుగును. 
 
కానీ చక్రములు గల యంత్రము పనిచేయుచుండగా పరిశీలిస్తున్నట్లు కల వచ్చినట్లైతే తమకు కలిగే నష్టములు ఎందువలనో తెలియవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.