శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (19:29 IST)

గురువారం పసుపు పచ్చని వస్త్రాన్ని దానం చేస్తే..?

గురువారం రోజు గురుగ్రహానికి అధిదేవతైన బృహస్పతిని పూజించాలి. ఉపవాస దీక్షను పాటించాలి. ఈ దీక్షను పాటిస్తున్న స్త్రీలు గురువారం తలంటి స్నానం చేయకూడదు. బృహస్పతిని ప్రసన్నుడిని చేసుకోవడం కోసం కదళీ వృక్ష ఫలపత్రాలను పూజలో పెట్టాలి. అలాగే మగవారు గడ్డం గీసుకోరాదనే నియమం ఉంది.  
 
పసుపు పచ్చని పువ్వులు, పసుపు రంగు ధాన్యం, గంధం మొదలైనవి ఈ పూజలో వినియోగిస్తారు. పసుపు పచ్చని వస్త్రాన్ని దానం చేయడం జరుగుతుంది.  నియమానుసారంగా నిర్వహించబడిన ఈ ఉపవాస దీక్ష దేవ గురుడైన బృహస్పతిని ప్రసనున్ని గావించి మంచి ఫలితాలను సాధకుడికి చేకూర్చుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఈ విధంగా గురువారం బృహస్పతిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని వారు సూచిస్తున్నారు.