గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (12:02 IST)

తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎన్నిసార్లు పునఃనిర్మించారో తెలుసా...!

తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇప్పటివరకు మూడుసార్లు పునఃనిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మొదటిసారి దేవశిల్పి విశ్వకర్మ నిర్మిస్తే రెండవసారి తొండమాన్‌ చక్రవర్తి, మూడవసారి ఎందరో రాజులు నిర్మించారు. క్రీ

తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇప్పటివరకు మూడుసార్లు పునఃనిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మొదటిసారి దేవశిల్పి విశ్వకర్మ నిర్మిస్తే రెండవసారి తొండమాన్‌ చక్రవర్తి, మూడవసారి ఎందరో రాజులు నిర్మించారు. క్రీ.శ.614లో పల్లవరాణి సామవై కాలంలో ఆనందనిలయం జీర్ణోద్ధారణ కావించబడింది. శ్రీ క్రిష్ణదేవరాయలు ఐదోసారి తిరుమల వచ్చినప్పుడు తన విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించుకున్నారు. బంగారంతో ఆనంద నిలయానికి పూత పూయించారు.
 
1870 వరకు తిరుమల చేరుకోవడానికి మెట్లమార్గం ఉండేది కాదు. కొండలను దాటుతూ కొండపైకి చేరుకోవడానికి రెండు రోజులు సమయం కూడా పట్టేదట. స్వామివారికి సుప్రభాత సేవ ఉదయం 7 గంటలకు, ఏకాంతసేవ 10.30 గంటలకు ఉండేదట. పైగా వసతి ఉండేది కాదట. మొదట్లో కొండపైన స్వామివారి దేవాలయం, ఒక మఠం తప్పితే ఎవరు, ఏ నివాసం ఉండేది కాదు. 
 
రాత్రి పూజ ఉండేందుకు ఆలోచించే వారు కాదు. 200జనాభాతో ఒక గ్రామంలో ఏర్పరచినారట. నెమ్మది నెమ్మదిగా జనాభా తక్కువ కాలంలోనే జనాభా పెరగడంతో వారిని ఖాళీ చేయించి తిరుపతికి పంపించేశారు. 1944లో మొట్టమొదటిసారిగా అలిపిరి నుంచి తిరుమలకు ఘాట్‌ రోడ్డు పూర్తి చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు రెండు బస్సులు నడిపేవారు. అవిరోజుకి మూడుసార్లు మాత్రమే తిరిగేవి. రాత్రి 7 గంటలకు చివరి బస్సు కొండపైకి వెళ్లేది.
 
తిరుమలలో విమాన వేంకటేశ్వరస్వామి వారిని ఆరాధించి వ్యాసతీర్థులు మోక్షం పొందారని ప్రతీతి. అందుకే భక్తులందరూ విమాన వేంకటేశ్వరస్వామిని దర్శింకుంటుంటారు. తిరుమలలో ఉన్న శిలాతోరణం డైనోసార్‌ల కంటే కూడా పూర్వం నుంచి ఉన్నవని పురాణాలు చెబుతన్నాయి. ప్రతి దేవాలయంలో ఉన్నట్లు వేంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు వినాయకుడు కనిపించడు. సుప్రభాత, అంగప్రదక్షిణ వంటి సేవలకు 12 సంవత్సరాల లోపు పిల్లలకు టిక్కెట్‌ అవసరం లేదు. తిరుమల శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం రచించింది అణ్ణన్‌ స్వామి రచించారు. ఈయన కాంచీపురంలో జన్మించారు. స్వామివారికి నైవేధ్యంగా పలిగిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని సమర్పిస్తారు.
 
తిరుమల లడ్డు పూర్వం ఉండేది కాదు 1940 సంవత్సరం నుంచే లడ్డు తయారీ మొదలైంది. దూర ప్రాంత వాసులు ఇంటికి ప్రసాదం తీసుకుని వెళ్ళడానికి వీలుగా తయారు చేశారు. ఏ అవతారంలో లేని విధంగా పాములను ఆభరణంగా వేంకటేశ్వరుడు కలిగి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.