శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:15 IST)

తిరుమలలో కళ్యాణోత్సవాలు ఎందుకు చేస్తారు...! ఎవరు ప్రారంభించారో తెలుసా...!

తిరుమల. తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు నిత్యకళ్యాణమే. స్వామి, అమ్మవార్లకు ఎప్పుడూ కళ్యాణోత్సవం చేస్తూనే ఉంటారు. స్వామి ఆలయంలోనే ప్రతిరోజు వందలాది మంది కళ్యాణోత్సవం చేయించుకుంటుంటారు. ప్రధానంగా కొత్తగా వి

తిరుమల. తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు నిత్యకళ్యాణమే. స్వామి, అమ్మవార్లకు ఎప్పుడూ కళ్యాణోత్సవం చేస్తూనే ఉంటారు. స్వామి ఆలయంలోనే ప్రతిరోజు వందలాది మంది కళ్యాణోత్సవం చేయించుకుంటుంటారు. ప్రధానంగా కొత్తగా వివాహమైన జంటలు ఎక్కువగా కళ్యాణోత్సవం చేయిస్తుంటారు. కారణం వందేళ్ళపాటు ఇద్దరు కలిసి ప్రశాంతంగా జీవించాలన్నదే వారి నమ్మకం. అందుకే కళ్యాణోత్సవాన్ని ఎక్కువ మంది భక్తులు చేయించుకుంటుంటారు. అసలు కళ్యాణోత్సవం తిరుమలలో ఎందుకు నిర్వహిస్తారో.. ఇప్పటివరకు భక్తులకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం..
 
పూర్వం శ్రీ మలయప్పస్వామివారికి విశేష పర్వదినాల్లో, బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కళ్యాణోత్సవం జరిగేది. కానీ ఆ తర్వాత తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తిరుమలలో నిత్యకళ్యాణాన్ని ఏర్పాటు చేసి స్వయంగా తాను కన్యాదాతగా కూడా నిర్వహించారని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమయ్య ఏర్పాటు చేసిన ఈ నిత్యకళ్యాణోత్సవం నేటికీ నిర్విఘ్నంగా, నిరాఘాటంగా కొనసాగుతూ తద్వారా ఆ జగత్ కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీనివాస ప్రభువుల సంపూర్ణమైన అనుగ్రహ పరంపరలను పొందడానికి అత్యంత శుభప్రదమైన విశిష్ట సేవగా యావత్‌ ప్రపంచంలోని భక్తలోకంలో గుర్తింపు పొందింది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 
 
తిరుమల క్షేత్రంలో భక్తులు అత్యధికంగా పాల్గొనే సేవ కూడా నిత్యకళ్యాణోత్సవం ఒక్కటే. కూటికే గడవని అతి పేదవారు మొదలుకుని కోట్లకు పడగెత్తిన ధనవంతుల వరకు కూడా అందరూ పాల్గొనే ఈ నిత్యకళ్యాణోత్సవంలో భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రతిరోజు 300కిపైగా కళ్యాణోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. నానాటికీ శ్రీ మలయప్పస్వామివారికి కళ్యాణోత్సవం చేయించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందువల్ల ఎప్పటికప్పుడు శ్రీవారి కళ్యాణ వేదిక మార్చబడుతూ ఉంది.
 
భక్తుల రాక కోసం ఎదురుచూస్తూ, ఆ వచ్చిన భక్తులను తన దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యం చేత ఆ దివ్యక్షణంలోనే మైమరపిస్తూ, ఆ భక్తులకు కళ్యాణ పరంపరల్ని గుప్పించడానికే నిత్య కళ్యాణోత్సవం చేయించుకుంటూ ఉన్న సర్వజగత్‌ ప్రభువు అయిన సప్తగిరీశునకు మరొక్కమారు మంగళప్రదంగా హారతులిస్తుంటారు.