గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (09:41 IST)

ఒంటిమిట్ట కోదండరామ ఆలయం గురించి....

ఒంటిమిట్ట కోదండరామ ఆలయానికి ఎన్నో ప్రత్యేకలున్నాయి. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ దేవాలయాల్లో కడప జిల్లా ఒంటిమిట్లలోని శ్రీకోదండ రామాలయం చెప్పుకోదగినది. విజయనగర పాలకుల్లో ఒకరైనా సదాశివరాముల కాలం నాటి శ

ఒంటిమిట్ట కోదండరామ ఆలయానికి ఎన్నో ప్రత్యేకలున్నాయి. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ దేవాలయాల్లో కడప జిల్లా ఒంటిమిట్లలోని శ్రీకోదండ రామాలయం చెప్పుకోదగినది. విజయనగర పాలకుల్లో ఒకరైనా సదాశివరాముల కాలం నాటి శిలా శాసనాలను బట్టి చూస్తే క్రీ.శ.1500 సంవత్సరానికి పూర్వమే ఈ ఆలయ నిర్మాణం జరిగింది.
 
మెుదటి శాసనం క్రీ.శ.1555లో రెండో శిలా శాసనాన్ని క్రీ.శ.1558లో వేయించారు వీటి ప్రకారం విజయనగర పాలకుడు వీర సదాశివ దేవరాయల సామంతుడు గుత్తి తిరుమలయ్య దేవ మహారాజు పులపత్తూరు గ్రామాన్ని ఆలయానికి దానం చేశారు. శ్రీకోదండ రామాలయ ప్రాకార నిర్మాణాలకు రథం బ్రహ్మోత్సవాల నిర్వహణకు తిరుమల రాజయ్య, నాగరాజయ్య దేవ మహారాజులు ఒంటిమిట్ల గ్రామానికి చెందే పల్లెలను, పొలాలను దానంగా ఇచ్చారు. 
 
శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ ఆనాటి దండకారణ్యంలో భాగమైన ఒంటిమిట్టకు వచ్చినట్లు ఇతిహానం చెబుతోంది. రాక్షసుల బెడద నివారణకు ఒకే శిలపై ఉన్న శ్రీసీతారామలక్ష్మణ విగ్రహాలను మునులకు ప్రదానం చేశారని అంటారు. ఈ విగ్రహాలు మూడు విడివిడిగా కనిపించినా ఇవన్నీ ఒకేశిలపై ఆవిర్భవించి ఉన్నందున ఈ గ్రామానికి ఏక శిలా నగరమని పేరు వచ్చినదని చరిత్ర కారులు చెబుతున్నారు.
 
ఈ పరిసర ప్రాంతాల్లో సీతాదేవి తనకు దాహంగా ఉందని చెబితే శ్రీరామచంద్రుడు తన బాణంతో పాతాళం నుండి గంగను పైకి తెప్పించాడట. నీళ్లు పడిన చోటు రామతీర్థమని, లక్ష్మణుని ద్వారా నిర్మించిన తీర్థం లక్ష్మణ తీర్థమని అంటారు. ఒకరోజు జాంబవంతుడు ఇక్కడ విశ్రమించగా స్వప్నంలో సీతారామలక్ష్మణులు దర్శనమివ్వడంతో ఆనంద భరితుడై విగ్రహాలను ప్రతిష్టించారు.